టీటీడీ ధార్మిక సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావు

21-01-2023 Sat 09:41 | Andhra
  • చాగంటిని సలహాదారుగా నియమించినట్టు వెల్లడించిన వైవీ సుబ్బారెడ్డి
  • గత మూడేళ్లుగా పారాయణాలను నిర్వహిస్తున్నామన్న టీటీడీ ఛైర్మన్
  • ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటిని నియమించామని వెల్లడి
Chaganti Koteswara Rao appointed as TTD advisor
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమితులయ్యారు. చాగంటిని సలహాదారుగా నియమిస్తూ హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయం తీసుకుందని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఉన్నారని... వారి కోసం గత మూడేళ్లుగా వివిధ పారాయణాలను నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. 

ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి చాగంటిని సలహాదారుగా నియమించామని తెలిపారు. తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్ లో నిన్న ఎస్వీబీసీ, హెచ్డీపీపీ కార్యనిర్వాహక కమిటీల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలోనే చాగంటిని సలహాదారుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో హిందూ ధర్మప్రచారం కార్యక్రమాలను స్థానిక యువత భాగస్వామ్యంతో విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు.