నేను సరోగసీ ద్వారా బిడ్డను కనడానికి కారణం ఇదే: ప్రియాంకా చోప్రా

21-01-2023 Sat 09:23 | Entertainment
  • అమెరికన్ సింగర్ జొనాస్ ను పెళ్లాడిన ప్రియాంక
  • సరోగసీ ద్వారా కూతురుకు జన్మనిచ్చిన వైనం
  • ఆరోగ్య సమస్యల కారణంగానే సరోగసీని ఎంచుకున్నామని వివరణ
Priyanka Chopra clarifies why she opted surrogacy
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ జొనాస్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఆమె అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. ఈ జంటకు ఒక కూతురు పుట్టింది. తన కూతురుకు మాల్తీ మేరీ చోప్రా జొనాస్ అని నామకరణం చేసింది. కూతురు ముఖం కనిపించకుండా ఆమె సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేసింది. 

ఇదిలావుంచితే, తన కూతురుకు సరోగసీ విధానం ద్వారా ప్రియాంక జన్మనిచ్చింది. తాను గర్భం దాల్చకుండా సరోగసీ ద్వారా బిడ్డకు జన్మనివ్వడంపై తాజాగా ప్రియాంక స్పందించింది. తనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని... అందుకే సరోగసీ విధానాన్ని ఎంచుకున్నామని ప్రియాంక తెలిపింది. దీంతో... అందం తగ్గకుండా ఉండేందుకే ప్రియాంక సరోగసీ ద్వారా బిడ్డను కనిందనే ప్రచారానికి తెరపడినట్టయింది. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ సినిమాలలో నటిస్తోంది.