Talasani: కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారు: మంత్రి తలసాని

Talasani slams Kishan Reddy over Secunderabad fire accident
  • సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ మాల్ లో అగ్నిప్రమాదం
  • కిషన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారన్న తలసాని
  • గుజరాత్ లో ఆమధ్య బ్రిడ్జి కూలిపోయి 180 మంది చనిపోయారని గుర్తుచేసిన మంత్రి 
  • దానిపై తామేమీ రాజకీయాలు చేయలేదన్న తలసాని
సికింద్రాబాద్ లోని డెక్కన్ స్పోర్ట్స్ వేర్ మాల్ అగ్నికి ఆహుతైన ఘటనపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. ఈ అగ్నిప్రమాదంపై కిషన్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. గుజరాత్ లో ఆమధ్య కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 180 మంది చనిపోతే తామేమీ కిషన్ రెడ్డి లాగా రాజకీయాలు చేయలేదని స్పష్టం చేశారు. భవనాల రెగ్యులరైజేషన్ పై కోర్టు స్టే ఉందన్న విషయం కిషన్ రెడ్డికి తెలియదా? అని తలసాని ప్రశ్నించారు. 

హైదరాబాదులో డెక్కన్ స్పోర్ట్స్ మాల్ వంటివి పాతిక వేల వరకు ఉండొచ్చని, అలాంటి కట్టడాల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై ఓ కమిటీ వేశామని వెల్లడించారు. అక్రమ కట్టడాలను ఇప్పటికిప్పుడు తొలగించడం కష్టమని తెలిపారు.
Talasani
Kishan Reddy
Fire Accident
Secunderabad
BRS
BJP
Telangana

More Telugu News