గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య ఆసక్తికర భేటీ

20-01-2023 Fri 21:35 | Telangana
  • కొంతకాలంగా ఇరువురి మధ్య విభేదాలు
  • మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో మరింత ఆజ్యం
  • ఏడాదిన్నర తర్వాత గాంధీభవన్ కు వచ్చిన కోమటిరెడ్డి
Komatireddy met Revanth Reddy in Gandhi Bhavan
హైదరాబాదులోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ నేడు ఆసక్తికర భేటీకి వేదికైంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారు. ఈ భేటీ తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచి వెంకట్ రెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మునుగోడు ఎన్నిక నేపథ్యంలో విభేదాలు మరింత ముదిరాయి. రేవంత్ ను లక్ష్యంగా చేసుకుని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటిది, ఇప్పుడు ఇద్దరూ కలవడం విశేషమనే చెప్పాలి. 

కాగా, ఏడాదిన్నర తర్వాత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గాంధీభవన్ లో అడుగుపెట్టారు. అయితే, సీనియర్ నేత వీహెచ్ తో వాగ్వాదం జరగ్గా, వీహెచ్ అక్కడ్నించి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.