'రైటర్ పద్మభూషణ్' ట్రైలర్ రిలీజ్!

20-01-2023 Fri 21:00 | Entertainment
  • సుహాస్ హీరోగా 'రైటర్ పద్మభూషణ్'
  • కథానాయికగా టీనా శిల్పరాజ్
  • దర్శకత్వం వహించిన షణ్ముఖ ప్రశాంత్ 
  • వచ్చేనెల 3వ తేదీన రిలీజ్ కానున్న సినిమా   
Writer Padmabhushan Trailer Released
సుహాస్ కథానాయకుడిగా ఇంతకు ముందు వచ్చిన 'కలర్ ఫొటో' అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినప్పటికీ, తనకి నచ్చిన కథలకి మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతున్నాడు. అలా ఆయన చేసిన మరో సినిమానే 'రైటర్ పద్మభూషణ్'. 

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలచుట్టూ తిరిగే అంశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 'ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ తాగుతారుగానీ, ఫ్రీగా ఇచ్చే పుస్తకం మాత్రం చదవరు' .. నా లైఫ్ అనే బుక్ లో పేజీలు తక్కువే ఉంటాయిగానీ కేరక్టర్లు .. ట్విస్టులు బాగానే ఉంటాయి" అనే డైలాగులు పట్టుకుంటాయి. 

సుహాస్ తండ్రి పాత్రలో ఆశిష్ విద్యార్ధి .. తల్లి పాత్రలో రోహిణి కనిపిస్తున్నారు. టీనా శిల్పారాజ్ ఈ సినిమాలో కథానాయికగా పరిచయం అవుతోంది. లహరి ఫిలిమ్స్ - చాయ్ బిస్కట్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, షణ్ముఖ్ ప్రశాంత్ దర్శకత్వం వహించాడు. వచ్చేనెల 3వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు