RRR: 'ఆర్ఆర్ఆర్' అందుకున్న 15 అంతర్జాతీయ అవార్డుల జాబితా ఇదిగో!

  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో చిత్రం
  • ఆర్ఆర్ఆర్ కు అంతర్జాతీయ గుర్తింపు
  • ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రం
RRR bags 15 international awards so far

తెలుగుజాతి గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ లను కాల్పనిక కథతో అనుసంధానించి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టించిన ఈ రాజమౌళి సినిమా అంతర్జాతీయంగానూ గుర్తింపు అందుకుంది. ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ పేరు ఆస్కార్ బరిలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఖాతాలో పెద్ద సంఖ్యలో ఇంటర్నేషనల్ అవార్డులు చేరాయి. ఈ నేపథ్యంలో, రాజమౌళి చిత్రం ఆస్కార్ లోనూ సత్తా చాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ కు దక్కిన అంతర్జాతీయ అవార్డులు ఇవే....

1. గోల్డెన్ గ్లోబ్ అవార్డు (జీజీఏ)
2. క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్ (సీసీఎంఏ)
3. లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎల్ఏ ఎఫ్ సీఏ)
4. సౌత్ ఈస్ట్రన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ (ఎస్ఈ ఎఫ్ సీఏ)
5. శాటర్న్ అవార్డ్ (ఎస్ఏ)
6. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆన్ లైన్ (ఎన్ఐఎఫ్ సీఓ)
7. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్ వైఎఫ్ సీసీ)
8. నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ (ఎన్ బీఆర్)
9. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్ (హెచ్ సీఏఏ)
10. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఏఎఫ్ సీసీ)
11. జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (జీఎఫ్ సీఏ)
12. బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ (బీఎస్ ఎఫ్ సీ)
13. ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఏఎఫ్ సీఏ)
14. అలయన్స్ ఆఫ్ ఉమెన్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ (ఏడబ్ల్యూఎఫ్ జే)
15. ఉటా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (యూఎఫ్ సీఏ)

More Telugu News