Nara Lokesh: లోకేశ్ పాదయాత్రపై డీజీపీకి రిమైండర్ లేఖ పంపిన వర్ల రామయ్య

  • ఈ నెల 27 నుంచి లోకేశ్ యువగళం పాదయాత్ర
  • 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు సాగనున్న పాదయాత్ర
  • పోలీసుల నుంచి ఇప్పటికీ లభించని అనుమతి
  • త్వరగా అనుమతి ఇవ్వాలంటూ తాజా లేఖలో పేర్కొన్న వర్ల
Varla Ramaiah sent reminder letter to DGP seeking quick approval for Nara Lokesh Yuvagalam

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పేరిట ఈ నెల 27 నుంచి రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్ల మేర ఆయన పాదయాత్ర సాగనుంది.

ఈ నేపథ్యంలో, లోకేశ్ పాదయాత్రపై రాష్ట్ర డీజీపీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య రిమైండర్ లేఖ పంపారు. లోకేశ్ యువగళం పాదయాత్ర అనుమతులకు సంబంధించి నేటి వరకు పోలీసు విభాగం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 27న పాదయాత్ర ప్రారంభం కానుందని, ఈ నేపథ్యంలో త్వరగా అనుమతులు ఇస్తే, ఏర్పాట్లు చేసుకునేందుకు వీలవుతుందని తెలిపారు. 

లోకేశ్ యువగళం పాదయాత్రను కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించనున్నారు. అనుమతులు కోరుతూ చిత్తూరు జిల్లా ఎస్పీకి కూడా ఈ నెల 12న లేఖ రాశారు. ఇప్పటికీ అనుమతి రాకపోగా, టీడీపీ నేతలు మాత్రం పాదయాత్రపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News