Public Urination: లండన్ లో ఇక బహిరంగ మూత్ర విసర్జన చేస్తే ఏం జరుగుతోందో తెలుసా...!

  • లండన్ మహానగరంలోనూ బహిరంగ మూత్ర విసర్జన సమస్య
  • సోహో టౌన్ షిప్ లో గోడలకు ప్రత్యేక పెయింట్
  • మూత్రం పోస్తే వెనక్కి చిందుతుందన్న అధికారులు
London walls will furnish with special paint to prevent public urination

అభివృద్ధి చెందిన దేశాల్లోనూ బహిరంగ మూత్ర విసర్జన అనేది ఒక సమస్యలా మారింది. పలు నగరాల్లో బహిరంగ మూత్ర విసర్జన వద్దంటూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఫలితం ఉండడంలేదు. ఈ నేపథ్యంలో, లండన్ మహానగరంలో అధికారులు వినూత్న కార్యాచరణ చేపడుతున్నారు. 

సెంట్రల్ లండన్ లోని సోహో టౌన్ షిప్ లో దాదాపు 12 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు... అక్కడి గోడలపై ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని పూయాలని నిర్ణయించారు. ఈ ద్రవం పూసిన గోడలపై మూత్రవిసర్జన చేస్తే, అది తిరిగి మూత్రం పోసిన వారిపైనే చింది పడుతుంది. తద్వారా బహిరంగ మూత్ర విసర్జనకు బ్రేక్ పడుతుందన్నది అధికారుల ఆలోచన. ఈ ద్రవం పూసిన గోడల వద్ద ప్రత్యేకంగా హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయనున్నారు. 

కాగా, ఈ ద్రవం ఒక పెయింట్ వంటి పదార్థమని, చాలా ప్రభావవంతమైన పనితీరు కనబరుస్తోందని స్థానిక కౌన్సిలర్ ఒకరు వెల్లడించారు. అంతేకాదు, ఆయన ఆ ద్రవం పనితీరును అందరికీ ప్రదర్శించి చూపించారు. ద్రవం పూసిన గోడపై కొన్ని నీళ్లు పోయగా, ఆ నీళ్లు వెంటనే వెనక్కి చిమ్మాయి

More Telugu News