చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు... ఆయన తల్లికి నోటీసుల అందజేత

20-01-2023 Fri 15:40 | Andhra
  • 'భారతి పే' సోషల్ మీడియా పోస్టుల కేసులో నోటీసులు
  • నర్సీపట్నం వెళ్లిన సీఐడీ అధికారులు
  • ఇంట్లో లేని చింతకాయల విజయ్
  • ఈ నెల 27న విచారణకు హాజరవ్వాలని స్పష్టీకరణ
CID police issues notice to Chinatakayala Vijay
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఐటీడీపీ చీఫ్ చింతకాయల విజయ్ పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు ఏపీ సీఐడీ పోలీసులు నేడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వెళ్లారు. 41ఏ నోటీసులు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు చింతకాయల విజయ్ నివాసానికి వెళ్లారు. విజయ్ ఇంట్లో లేకపోవడంతో ఆయన తల్లికి నోటీసులు అందించారు. చింతకాయల విజయ్ ఈ నెల 27న మంగళగిరిలో సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 

సోషల్ మీడియాలో 'భారతి పే' పేరిట పోస్టులు పెట్టినట్టు చింతకాయల విజయ్ పై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులోనే తాజాగా నోటీసులు ఇచ్చారు.