భారత్ నూతన పార్లమెంటు లోపల ఎలా ఉందో చూశారా...?

20-01-2023 Fri 14:56 | National
  • దేశ రాజధానిలో సెంట్రల్ విస్టా
  • నూతన పార్లమెంటు భవనాల నిర్మాణం
  • అత్యాధునిక రీతిలో లోక్ సభ, రాజ్యసభ హాళ్లు
  • మార్చిలో ప్రారంభం కానున్న నూతన పార్లమెంటు భవనం!
Here is the inside of Indain parliament new building
దేశరాజధాని ఢిల్లీలో సెంట్రల్ విస్టాలో భాగంగా కొత్త పార్లమెంటు భవనం కూడా రూపుదిద్దుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ నిర్మాణ శైలికి, అత్యాధునిక సాంకేతికతకు అద్దం పట్టేలా నూతన పార్లమెంటు భవనం ఉంది. 

లోక్ సభ, రాజ్యసభకు విశాలమైన హాళ్లు, ముఖ్యనేతలకు అన్ని సౌకర్యాలతో కూడిన చాంబర్లు, లైబ్రరీలు, భారీ పార్కింగ్ స్థలంతో నూతన పార్లమెంటు భవనం తుదిమెరుగులు దిద్దుకుంటోంది. మార్చి నెలలో ఈ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ఉంటుంది. ఈ భవన నిర్మాణాన్ని టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ చేపట్టిన సంగతి తెలిసిందే.