noodles: ఈ వీడియో చూస్తే నూడుల్స్ తినడానికి మనసు ఒప్పుకోదు!

Fan of street side noodles street side shows how its made and you will probably not want to eat it ever
  • నూడుల్స్ ఫ్యాక్టరీలో అపరిశుభ్ర పరిస్థితులు
  • నాణ్యత ప్రమాణాలు పాటించకుండానే తయారు చేస్తున్న తీరు
  • రోడ్డు పక్కన అమ్మేవి ఏవైనా తయారీ ఇంతేనంటూ యూజర్ల స్పందన
బడా కంపెనీలు నూడుల్స్ ఎలా తయారు చేస్తాయో మనకు తెలియదు. తయారీ ప్రక్రియలో అవి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తాయనే విశ్వసిస్తాం. లేదంటే ఆయా బ్రాండ్లకు చెడ్డ పేరు వస్తే, కోలుకోవడం కష్టమవుతుంది. బ్రాండెడ్ ను పక్కన పెడితే.. వీధుల వెంట బండ్లపై కనిపించే హక్కా నూడుల్స్ గుర్తు చేసుకోండి. వాటిని తయారు చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలపైకి చేరి వైరల్ అవుతోంది.

అపరిశుభ్ర పరిస్థితుల నడుమ నూడుల్స్ తయారు చేస్తున్న విధానం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఓ చిన్న నూడుల్స్ ఫ్యాక్టరీలో పనివారు కనీసం చేతికి గ్లోవ్స్ కూడా లేకుండా, కాలికి సైతం ఎలాంటి రక్షణ కవర్లు ధరించకుండా వంటిపై స్లీవ్ లెస్ బనియన్లు వేసుకుని నూడుల్స్ తయారు చేస్తున్న విధానం జుగుప్స కలిగిస్తుంది. తయారీలో భాగంగా వాటిని నేలపైనే వేస్తుండడాన్ని చూడొచ్చు. 

‘‘పెద్ద బ్రాండ్లు మినహా.. నూడుల్స్ అనే కాదు, వీధుల వెంట బండ్లపై కనిపించే పానీ పూరీ, సేవ్ పూరీ, శాండ్ విచ్ అన్నింటినీ ఇదే మాదిరి తయారు చేస్తుంటారు’’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. అన్ని చోట్లా ఇదే మాదిరి పరిస్థితులు అంటూ యూజర్లు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.
noodles
making
street side
viral vedio

More Telugu News