రిలయన్స్ జియో నుంచి రెండు కొత్త ప్లాన్లు

20-01-2023 Fri 10:46 | Technology
  • రూ.349 ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు
  • రూ.899 ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు
  • రెండింటిలోనూ ప్రయోజనాలన్నీ ఒక్కటే
  • వీటితో 5జీ సేవలు పొందే అవకాశం
Reliance Jio launched 2 new plans
రిలయన్స్ జియో రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. ఇందులో రూ.349 ప్లాన్ ఒకటి. రోజువారీ 2.5 జీబీ డేటా, ఉచిత కాల్స్, రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఇందులో లభిస్తాయి. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు. 30 రోజుల్లో మొత్తం మీద 75జీబీ డేటా వినియోగించుకోవచ్చు. దీనికితోడు జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ ఉచితంగా లభిస్తాయి. వెల్ కమ్ ఆఫర్ కింద 5జీ సేవలను సైతం పొందొచ్చు.

రూ.899 రీచార్జ్ ప్లాన్ లోనూ రోజువారీ 2.5 జీబీ ఉచిత డేటా లభిస్తుంది. అలాగే, ఉచిత కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా పొందొచ్చు. ఈ ప్లాన్ లోనూ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. మరోవైపు రిలయన్స్ జియో ఇప్పటి వరకు 100కు పైగా పట్టణాల్లో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, తిరుపతి, నెల్లూరు, ఏలూరు పట్టణాల్లో జియో 5జీ సేవలు వినియోగించుకోవచ్చు.