కర్ణాటక అండర్-14 జట్టు కెప్టెన్ గా ద్రావిడ్ చిన్న కుమారుడు

19-01-2023 Thu 21:27 | Sports
  • క్రికెట్లో రాణిస్తున్న ద్రావిడ్ కుమారులు
  • ఇప్పటికే జూనియర్ క్రికెట్లో సత్తా చాటిన పెద్ద కుమారుడు సమిత్
  • ఇప్పుడు అండర్-14 స్థాయిలో రాణిస్తున్న చిన్న కుమారుడు అన్వయ్
Dravid younger son Anvay appointed as Karnataka under 14 skippr
టీమిండియా ప్రధాన కోచ్, భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు అన్వయ్ కూడా తండ్రి బాటలోనే క్రికెట్ లో రాణిస్తున్నాడు. అన్వయ్ ద్రావిడ్ తాజాగా కర్ణాటక అండర్-14 జట్టుకు కెప్టెన్ గా నియమితుడయ్యాడు. 

కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్ సీఏ) నిర్వహించే జూనియర్ క్రికెట్ పోటీల్లో అన్వయ్ ద్రావిడ్ విశేషంగా రాణిస్తున్నాడు. కర్ణాటక జూనియర్ క్రికెట్లో నిలకడగా ఆడుతున్న బాలల్లో అన్వయ్ కూడా ఉన్నాడు. బాలల క్రికెట్లో మంచి బ్యాట్స్ మన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు, తండ్రి రాహుల్ ద్రావిడ్ లాగే అన్వయ్ వికెట్ కీపర్ కూడా. అన్వయ్ సారథ్యంలోని జట్టు పి.కృష్ణమూర్తి ఇంటర్ జోనల్ ట్రోఫీలో పాల్గొననుంది. 

ఇక, ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ కూడా ప్రొఫెషనల్ క్రికెటరే. 2019-20 సీజన్ లో సమిత్ రెండు డబుల్ సెంచరీలు బాది కర్ణాటక క్రికెట్లో ప్రకంపనలు సృష్టించాడు.