Sensex: లాభాలకు బ్రేక్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 187 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 57 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 2.64 శాతం పతనమైన ఏసియన్ పెయింట్స్ షేర్ విలువ
markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఈ ఉదయం మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. చివరి వరకు అదే ట్రెండ్ ను కొనసాగించాయి. కేంద్ర బడ్జెట్, రానున్న ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈరోజు ట్రేడింగ్ ముగించే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు నష్టపోయి 60,858కి పడిపోయింది. నిఫ్టీ 57 పాయింట్లు కోల్పోయి 18,107 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా స్టీల్ (0.73%), పవర్ గ్రిడ్ (0.64%), టెక్ మహీంద్రా (0.49%), యాక్సిస్ బ్యాంక్ (0.47%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.44%). 

టాప్ లూజర్స్: 
ఏసియన్ పెయింట్స్ (2.64%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.89), టాటా మోటార్స్ (1.87), కోటక్ బ్యాంక్ (1.73), టైటాన్ (1.59).

More Telugu News