business: 30 వేల లోపు ఖరీదులో బెస్ట్ గేమింగ్ ఫోన్లు ఇవిగో!

  • 24 వేల నుంచి 30 వేల ఖరీదులో బెస్ట్ ఫోన్లు
  • ఐకూ నుంచి అందుబాటులో రెండు స్మార్ట్ ఫోన్లు
  • రెడ్ మీ నోట్ 12 ప్రో కూడా గేమింగ్ కు బెస్ట్ చాయిస్ అంటున్న నిపుణులు
Best gaming phones under 30000 Rupees

కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా.. ఫోన్ లో ఇతర ఫీచర్లతో పాటు గేమ్స్ ఆడేందుకు సరిపోయే మంచి ఫోన్ కావాలని వెతుకుతున్నారా ? కాస్త తక్కువ ధరలో మంచి గేమింగ్ ఫోన్ కావాలని అనుకునే వారి కోసం ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్స్.. ఈ స్మార్ట్ ఫోన్లు వాటి ఫీచర్లు, ధర తదితర విశేషాలు..

ఐకూ 9 ఎస్ఈ :
ఐకూ నుంచి కొత్తగా వచ్చిన బెస్ట్ గేమింగ్ ఫోన్ ఇది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ సామర్థ్యం వున్న ఈ ఫోన్ ధర రూ.28,990. అమో ఎల్ఈడీ డిస్ ప్లేతో 6.6 ఇంచుల స్క్రీన్ సైజు, 120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో మార్కెట్లోకి వచ్చిందీ ఫోన్. ఇందులో కెమెరా 48 మెగా పిక్సెల్, బ్యాటరీ సామర్థ్యం 4500 ఎమ్ఏహెచ్.

ఐకూ నియో 6 :
ఐకూ నుంచి మార్కెట్లోకి విడుదలైన మరొక బెస్ట్ గేమింగ్ ఫోన్. అమెజాన్ లో అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు రూ.27,999. గేమ్స్ కు సపోర్ట్ చేసేందుకు 5జీ చిప్ సెట్ ప్రాసెసర్ తో దీనిని తయారుచేశారు. రియర్ కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ కాగా బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్. ఈ స్మార్ట్ ఫోన్ స్క్రీన్ 6.62 ఇంచెస్. 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ సామర్థ్యంతో అందుబాటులో ఉంది.

పోకో ఎఫ్4 (5జీ) :
గేమ్స్ లవర్స్ ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 870 చిప్ సెట్ తో తయారుచేసిన స్మార్ట్ ఫోన్ పోకో ఎఫ్ 4 (5జీ). ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ సామర్థ్యంతో పనిచేస్తుంది. ధర రూ.27,999, 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 6.67 ఇంచుల అమో ఎల్ఈడీ స్క్రీన్ తో అందుబాటులో ఉంది. 

రెడ్ మీ నోట్ 12 ప్రో :
గేమింగ్ ఫోన్ల కేటగిరిలో తక్కువ ధరలో బెస్ట్ ఫోన్ గా రెడ్ మీ నోట్ 12 ప్రో ను పేర్కొనవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.24,999 నుంచి మొదలవుతుంది. ఫీచర్లను బట్టి ఫోన్ ధర మారుతుంటుంది. 6.67 ఇంచుల అమో ఎల్ఈడీ డిస్ ప్లే, 50 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మార్కెట్లో అందుబాటులో ఉంది.

శాంసంగ్ గాలక్సీ ఎస్20 ఎఫ్ఈ :
స్నాప్ డ్రాగన్ 856 ప్రాసెసర్ తో తయారైన ఈ స్మార్ట్ ఫోన్ ఖరీదు రూ. 29,990. ఇందులో 6.5 ఇంచుల సూపర్ అమో ఎల్ఈడీ డిస్ ప్లే, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో మార్కెట్లోకి విడుదలైంది. గేమ్స్‌ కు సపోర్ట్‌ చేసే బెస్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌లో సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎస్‌20 ఎఫ్‌ఈ ఒకటి.

More Telugu News