Gas Stove: వంటింటి గ్యాస్ స్టవ్ తోనూ వ్యాధుల ముప్పు!

Gas Stoves Health Dangers and How to Lower Your Risk
  • హెచ్చరిస్తున్న పరిశోధనలు
  • వంట చేసే సమయంలో హానికారక వాయువుల విడుదల
  • వాటిని పీల్చడం వల్ల దీర్ఘకాలంలో శ్వాసకోస వ్యాధులు
మనం వంటింట్లో వినియోగించే గ్యాస్ స్టవ్ సురక్షితమేనా..? అంటే.. కాదన్నదే సమాధానం. గ్యాస్ నుంచి వెలువడే ఉద్గారాలు మన ఆరోగ్యానికి ప్రమాదకరమని అమెరికాకు చెందిన కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషనర్ (సీపీఎస్ సీ) చీఫ్ అలెక్స్ అంటున్నారు. గ్యాస్ స్టవ్ నుంచి విడుదలయ్యే ఉద్గారాలు ప్రమాదకరమని పరిశోధనలు సూచిస్తున్నట్టు ఆయన చెప్పారు. దీంతో ఇంట్లోని వాయు నాణ్యత ప్రమాణాల పెంపునకు, ఆరోగ్యంపై చూపించే హానిని తగ్గించే మార్గాలపై సీపీఎస్ సీ దృష్టి సారించినట్టు తెలిపారు. ఈ ప్రకటనతో వంటింటి గ్యాస్ స్టవ్ వెలువరించే ఉద్గారాలపై మరోసారి చర్చ మొదలైంది. 

ఇంటర్నల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం.. అమెరికాలో 13 శాతం చిన్నారుల ఆస్థమా కేసులకు గ్యాస్ స్టవ్ ఉద్గారాలు కారణంగా ఉంటున్నాయి. గతంలోనూ కొన్ని అధ్యయనాలు ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఎక్కువ అధ్యయనాలు చెబుతున్నది గ్యాస్ట్ స్టవ్ కు, ఆస్థమాకు మధ్య సంబంధం ఉందనే. గ్యాస్ స్టవ్ మండుతున్న సమయంలో వెలువడే వాయువులను అక్కడే ఉండి వంట చేసే వారు పీల్చడం వల్ల వారి ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

గ్యాస్ స్టవ్ పూర్తి సురక్షితం కాదు
వంటింట్లో గ్యాస్ స్టవ్ ను వినియోగించే సమయంలో నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ అనే విష వాయువులు విడుదల అవుతాయి. కనుక ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి సారించాల్సిందే. ‘‘నేచురల్ గ్యాస్ ను మండించినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్ (ధూళి కణాలు) విడుదల అవుతాయి. ఇవి శ్వాసకోస వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి’’ అని అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియా డీ విజ్కే రూజ్ పేర్కొన్నారు. కనుక వంట చేసే సమయంలో విడుదలయ్యే పొగ బయటకు వెళ్లిపోయే ఏర్పాట్లు చేసుకోవడం కాస్త రక్షణ చర్యగా చెప్పుకోవాలి. గాలి, వెలుతురూ వచ్చే చక్కని వెంటిలేషన్ ఉండాలి. వీలైతే చిమ్నీ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
Gas Stove
Health risk
Dangers
emmissions
hazardous

More Telugu News