తెలంగాణ కొత్త సచివాలయం కింద మినీ రిజర్వాయర్!

19-01-2023 Thu 12:54 | Telangana
  • రెండున్నర లీటర్ల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మాణం
  • వాన నీటిని అందులోకి తరలించేలా పైప్ లైన్ల ఏర్పాటు
  • ఫిబ్రవరి 17న ప్రారంభం కానున్న కొత్త సెక్రటేరియట్ 
heavy water sorage tank at telangana  new secratariet
హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు అయిన ఫిబ్రవరి 17వ తేదీన సెక్రటేరియట్ ను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ భారీ భవనం నిర్మితం అవుతోంది. 

సెక్రటేరియల్ లో పని చేసే వేలాది మంది ఉద్యోగుల అవసరాలు, ప్రాంగణంలో చెట్లు, పచ్చిక నీటి అవసరాల కోసం భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల నిల్వ సామర్థ్యంతో స్టోరేజీ ట్యాంక్ సిద్ధం చేశారు. ఇది దాదాపు ఓ మినీ రిజర్వాయర్ లా ఉంటుంది. దీనికి మరో ప్రత్యేకత కూడా ఉండనుంది. వాన నీటిని ఒడిసి పట్టేలా దీన్ని నిర్మించారు. సచివాలయం భవనం నలువైపుల నుంచి వాన నీరు ఇందులోకి వచ్చేలా ప్రత్యేక పైప్ లైన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.