Gujarat: 9 ఏళ్ల ప్రాయంలోనే భౌతిక సుఖాలపై మొహం మొత్తి.. సన్యాసిగా మారిన జైన బాలిక!

9 Year Old Daughter Of Gujarat Diamond Trader Becomes Monk in Surat
  • గుజరాత్‌లోని సూరత్‌లో ఘటన
  • తండ్రి వజ్రాల వ్యాపారి
  • తల్లిదండ్రులను ఒప్పించి సన్యాస దీక్ష
  • హాజరైన వందలాది మంది
తండ్రి వజ్రాల వ్యాపారి, సుసంపన్నమైన కుటుంబం.. అయినా ఆ చిన్నారికి అవేమీ పట్టలేదు. 9 ఏళ్ల పసిప్రాయంలోనే భౌతిక సుఖాలకు దూరంగా జరగాలనుకుంది. సన్యాసం స్వీకరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. గుజరాత్‌లో జరిగిందీ ఘటన. సూరత్‌కు చెందిన ధనేష్ వజ్రాల వ్యాపారి. ఆయన భార్య అమీ సంఘ్వీ. ధనేస్ మూడు దశాబ్దాలుగా వజ్రాల పాలిష్, ఎగుమతి వ్యాపారం చేస్తున్నారు.

ధనేష్-అమీ దంపతుల పెద్ద కుమార్తె అయిన దేవాన్షి వయసు 9 సంవత్సరాలు. ఆధ్యాత్మిక జీవితంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి పెంచుకున్న దేవాన్షికి ఇటీవల సన్యాసం స్వీకరించాలని అనిపించింది. మనసులోని మాటను తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించింది. కుమార్తె నిర్ణయాన్ని తల్లిదండ్రులు కాదనలేకపోయారు. 

జైన సన్యాసి ఆచార్య విజయ కీర్తియశ్సూరి సమక్షంలో చిన్నారి నిన్న సన్యాస దీక్ష తీసుకుంది. అంతేకాదు, దీక్ష తీసుకోవడానికి ముందు ఇతర సన్యాసులతో కలిసి 700 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. దేవాన్షి ఐదు భాషలను అనర్గళంగా మాట్లాడుతుంది. కాగా, ఆమె సన్యాస స్వీకరణ కార్యక్రమానికి వందలాదిమంది హాజరయ్యారు.
Gujarat
Diamond Trader
Jain Monk
Devanshi
Surat

More Telugu News