హైదరాబాదు వన్డేలో గిల్ సెంచరీ... భారీ స్కోరు దిశగా భారత్

18-01-2023 Wed 16:42 | Sports
  • ఉప్పల్ స్టేడియంలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • 87 బంతుల్లోనే 100 పరుగులు చేసిన గిల్
  • 41 ఓవర్లలో 5 వికెట్లకు 241 పరుగులు చేసిన భారత్
Gill completes ton as Team India eyes on huge total
హైదరాబాదులో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే జరుగుతోంది. భారత యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ సెంచరీ సాధించడం విశేషం. గిల్ 87 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. గిల్ ఇటీవల శ్రీలంకతో మూడో వన్డేలోనూ సెంచరీ బాదడం తెలిసిందే. సూపర్ ఫామ్ లో ఉన్న గిల్ ఇవాళ హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలోనూ పరుగుల వెల్లువ సృష్టించాడు. 

ప్రస్తుతం టీమిండియా స్కోరు 41 ఓవర్లలో 5 వికెట్లకు 257 పరుగులు. గిల్ 138 పరుగులతోనూ, వాషింగ్టన్ సుందర్ 4 పరుగులతోనూ ఆడుతున్నారు. రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. 

కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్ 2, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నర్ 1, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశారు.