'వరిసు' 7 రోజుల వసూళ్లు ఎంతంటే..!

18-01-2023 Wed 15:06 | Entertainment
  • తమిళనాట ఈ నెల 11న విడుదలైన 'వరిసు'
  • వారం రోజుల్లో 210 కోట్ల వసూళ్లు 
  • తెలుగులో ఎదురైన గట్టిపోటీ 
  • అందువల్లనే నిదానించిన వసూళ్లు
Varisu Movie Update
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'వరిసు' సినిమా రూపొందింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. తమిళనాట విజయ్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. అందువలన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో అక్కడ తన ప్రయాణాన్ని మొదలెట్టింది. 

నిన్నటితో ఈ సినిమా అక్కడ వారం రోజుల ప్రదర్శనను పూర్తిచేసుకుంది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా 210 కోట్లను వసూలు చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను అధికారికంగా రిలీజ్ చేశారు. మాస్ హీరో అయిన విజయ్ తో ఫ్యామిలీ ఎంటర్టయినర్ చేయడమేంటి? అనే విమర్శలకు సమాధానంగా ఈ  సినిమా ఈ స్థాయి వసూళ్లను రాబట్టింది. 

ఒక వైపున అజిత్ సినిమా బరిలో ఉన్నప్పటికీ, విజయ్ దూకుడు మాత్రం తగ్గలేదు. జోనర్ విషయంలో దిల్ రాజు అంచనాలు తప్పలేదనే అంటున్నారు. ఇక తెలుగులో 'వారసుడు' మాత్రం, అటు చిరంజీవి .. ఇటు బాలకృష్ణ సినిమాల పోటీని తట్టుకోలేకపోయాడు. చూసినవారు మాత్రం ఇది సంక్రాంతి పండుగకి తగిన కంటెంట్ తో వచ్చిందనే అంటున్నారు.