Team India: రెండు వికెట్లు కోల్పోయిన భారత్​.. రోహిత్​, కోహ్లీ ఔట్

Team indai loose rohit and kohli wickets
  • ఉప్పల్ లో న్యూజిలాండ్ తో తొలి వన్డే
  • 34 పరుగులు చేసి ఔటైన రోహిత్
  • 8 పరుగులకే వెనుదిరిగిన కోహ్లీ
ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. శుభ్ మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. అటు గిల్, ఇటు రోహిత్ ఆరంభం నుంచే మంచి షాట్లతో అలరించారు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ 12 ఓవర్లలో తొలి వికెట్ కు 60 పరుగులతో మంచి పునాది వేశారు. కానీ, టిక్కర్ వేసిన  13వ ఓవర్ తొలి బంతికి నేరుగా భారీ షాట్ ఆడబోయిన రోహిత్ శర్మ మిడాన్లో డారిల్ మిచెల్ కు క్యాచ్ ఇచ్చాడు. దాంతో, 34 పరుగులకే అతను వెనుదిరిగాడు. 

అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ తన ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. శ్రీలంకతో సిరీస్ లో రెండు సెంచరీలు సాధించిన కోహ్లీ.. షిప్లీ బౌలింగ్ లో తొలి ఫోర్ కొట్టాడు. కానీ, 16వ ఓవర్లో అద్భుత టర్నింగ్ బాల్తో మిచెల్ శాంట్నర్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. విరాట్ 8 పరుగులకే పెవిలియన్ చేరగా.. భారత్ 88/2తో నిలిచింది. మరో  ఓపెనర్ గిల్ మాత్రం ధాటిగా ఆడుతున్నాడు. ప్రస్తుతం అతను 44 పరుగులు చేయగా.. డ్రింక్స్ బ్రేక్ సమయానికి భారత్ 17 ఓవర్లలో 95/2 స్కోరుతో నిలిచింది. గిల్ కు తోడు ఇషాన్ కిషన్ 4 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Team India
Team New Zealand
odi
uppal stadium

More Telugu News