SS Rajamouli: ఆర్ఆర్ఆర్​కు మరో అంతర్జాతీయ అవార్డు

  • సియాటెల్ క్రిటిక్స్ పురస్కారం సొంతం
  • ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీకి గాను పురస్కారం
  • ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న చిత్రబృందం
RRR wins Seattle Critics Award for Best Action Choreography

దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు చేరింది. గతవారం ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న ఈ సినిమా తాజాగా సియాటెల్ క్రిటిక్స్ పురస్కారం దక్కించుకుంది. ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీకి గాను ఈ చిత్రానికి అవార్డు లభించింది. ఈ విషయాన్ని సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. విక్కీ ఆరోరా, ఇవాన్ కొస్టాడినోవ్, నిక్ పావెల్, రియచో వసిలెవ్ యాక్షన్ స్టంట్స్ కు కోఆర్డినేటర్లుగా పని చేశారు. ప్రేమ్ రక్షిత్, దినేశ్ క్రిష్ణన్ స్టంట్స్ కొరియాగ్రఫీ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలోని నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచింది. 14 కేటగిరీల్లో బరిలో ఉంది. నాటునాటు పాట అవార్డులకు షార్ట్  లిస్ట్ కూడా అయింది. ఈ నెల 24న ఆస్కార్ అవార్డులను ప్రకటించనున్నారు.

More Telugu News