CBI: రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో కిలోల కొద్ది బంగారం.. ఒడిశాలో సీబీఐ దాడుల్లో బయటపడ్డ అక్రమాస్తులు

CBI raids on retired railway officer and recovered Above Rs 1 crore cash and 17 kg gold
  • 17 కిలోల బంగారం.. 1.57 కోట్ల నగదు గుర్తించిన అధికారులు
  • 2.5 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్ పేపర్లు.. ఆస్తి పత్రాలు కూడా!
  • కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టాడనే ఆరోపణల నేపథ్యంలో రైల్వే విశ్రాంత ఉద్యోగి ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. భువనేశ్వర్ లోని సదరు ఉద్యోగి ఇంట్లో కిలోల కొద్దీ బంగారం, రూ. 1.57 కోట్ల విలువైన నోట్లకట్టలు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. ఒడిశాకు చెందిన ప్రమోద్ కుమార్ జెనా ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ప్రిన్సిపల్ సెక్రటరీ మేనేజర్ గా పనిచేశారు. కిందటేడాది పదవీ విరమణ చేసిన ప్రమోద్ కుమార్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీబీఐకి సమాచారం అందింది. 

ఈ నెల 4న భువనేశ్వర్ లోని ప్రమోద్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు. ఆయన ఇంట్లో రహస్యంగా దాచిన 17 కిలోల బంగారు ఆభరణాలు, 1.57 కోట్ల విలువైన నోట్లకట్టలు, 2.5 కోట్ల విలువైన ఫిక్స్ డ్ డిపాజిట్లకు సంబంధించిన పేపర్లు, కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల పేర్ల మీద ఉన్న స్థిరాస్తులకు సంబంధించిన పేపర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని కేసు నమోదు చేసిన అధికారులు ప్రమోద్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.
CBI
Odisha
railway
retaired employee
cbi raids
17 kg gold

More Telugu News