'కస్టడీ' నుంచి కృతి శెట్టి పోస్టర్ రిలీజ్!

18-01-2023 Wed 11:47 | Entertainment
  • వెంకట్ ప్రభు నుంచి 'కస్టడీ' మూవీ 
  • ఛైతూ జోడీకట్టిన కృతి శెట్టి
  • ఇళయరాజా సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • మే 12న తెలుగు .. తమిళ భాషల్లో రిలీజ్
Custody Movie Update
నాగచైతన్య - కృతి శెట్టి జంటగా 'కస్టడీ' సినిమా రూపొందుతోంది. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమా ఆసక్తిని రేకెత్తిస్తోంది. చిట్టూరి శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించాడు. తెలుగు .. తమిళ భాషల్లో మే 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కృతి శెట్టి పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో ఆమె 'రేవతి' పాత్రను పోషించిందనే విషయాన్ని రివీల్ చేశారు. రేవతి ఆందోళన .. ఆవేదనకి లోనైనట్టుగా ఈ పోస్టర్లో కనిపిస్తోంది. అందుకు కారణం ఏమై ఉంటుందనే ఒక ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశారు. 

ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. 'బంగార్రాజు' తరువాత చైతూ - కృతి శెట్టి కలిసి నటిస్తున్న సినిమా ఇది. అందువలన అందరిలో ఆసక్తి ఉంది. ఈ సినిమా హిట్ చైతూకి చాలా అవసరం. ఇక వరుస ఫ్లాపులతో ఉన్న కృతికి మరింత అవసరమనే చెప్పాలి.