నాని చేతుల మీదుగా HER టీజర్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న విజువల్స్

18-01-2023 Wed 11:23 | Entertainment
  • సస్పెన్స్ థ్రిల్లర్ గా 'HER' Chapter 1
  • పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న రుహాని శర్మ 
  • దర్శకుడిగా శ్రీధర్ పరిచయం 
  • త్వరలోనే ప్రేక్షకుల ముందుకు   
HER Movie Teaser Released
'చి .. ల.. సౌ' సినిమాతో తెలుగు తెరపై అడుగుపెట్టి కెరీర్ పరంగా విలక్షణ కథలను ఎంచుకుంటూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది హీరోయిన్ రుహాని శర్మ. HIT సినిమాలో తన టాలెంట్ బయటపెట్టి సక్సెస్ అందుకున్న రుహాని .. అదే బాటలో ఇప్పుడు HER అనే ఓ వైవిధ్యభరితమైన సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
 ఇప్పటి వరకూ సాఫ్ట్ రోల్స్ చేస్తూ ఆకట్టుకున్న ఈ హీరోయిన్, తొలిసారి ఫిమేల్ లీడ్ చేస్తూ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. HER Chapter 1 అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో తనలోని మరో యాంగిల్ చూపించేందుకు రెడీ అయింది. తాజాగా ఈ సినిమా టీజర్ ను నాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ వదిలిన అనంతరం చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ చెబుతూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు నాని.

ఈ టీజర్ లో రుహాని శర్మ క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆమె ఓ చాలెంజింగ్ రోల్ చేసిందని వీడియోలోని సన్నివేశాలు ప్రూవ్ చేశాయి. డ్యూటీ పరంగా 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఓ హత్య కేసును ఛేదించడానికి తిరిగి ఖాకీ డ్రెస్ ధరించిన రుహాణి శర్మ సీన్ తో మొదలైన ఈ టీజర్, ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రఘు - దీప నిర్మించిన ఈ సినిమాకి, శ్రీధర్ స్వరగావ్ దర్శకత్వం వహించాడు. వికాస్ వశిష్ట .. ప్రదీప్ రుద్ర .. జీవన్ కుమార్ .. అభిజ్ఞ .. సంజయ్ స్వరూప్ .. బెనర్జీ .. రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.