ఎన్టీఆర్ 27వ వర్ధంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు

18-01-2023 Wed 07:57 | Both States
  • తెల్లవారుజామునే ఎన్టీఆర్ ఘాట్‌కు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
  • సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు
  • ఉభయ తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ప్రత్యేక కార్యక్రమాలు
Jr NTR and Kalyan Ram Tributes NTR On His 27th death Anniversery
నందమూరి తారక రామారావు 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే ఘాట్ వద్దకు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌ తాత సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. మరికొందరు కుటుంబ సభ్యులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించనున్నారు.

ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించనున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సేవలను స్మరించుకోనున్నారు.