బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించిన మోదీ

17-01-2023 Tue 21:03 | National
  • ప్రజలతో మమేకమై ఎన్టీఆర్ ముందడుగు వేశారన్న మోదీ
  • ప్రజాక్షేత్రంలో పోరాడి అధికారంలోకి వచ్చారని కితాబు
  • బండి సంజయ్ పోరాడుతున్న తీరు కూడా అభినందనీయమన్న ప్రధాని
Modi praises NTR
ఈరోజు ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా పదవీకాలాన్ని మళ్లీ పొడిగించారు. మరోవైపు ప్రధాని మోదీ ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. 

నిత్యం ప్రజలతో మమేకమై ఎన్టీఆర్ ముందడుగు వేశారని కొనియాడారు. ప్రజాక్షేత్రంలో కింది స్థాయిలో పోరాడి అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్ ది అని చెప్పారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ప్రజాక్షేత్రంలో గట్టిగా పోరాడుతున్నారని కితాబునిచ్చారు. బండి సంజయ్ పోరాడుతున్న తీరు అభినందనీయమని చెప్పారు. మన దేశానికి అత్యుత్తమ శకం రాబోతోందని మోదీ అన్నారు. దేశాభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు.