సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ?: చంద్రబాబు

17-01-2023 Tue 20:05 | Andhra
  • ముస్లింలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు 
  • ఇదెక్కడి రాజకీయం? అంటూ పెద్దిరెడ్డికి ప్రశ్న
  • పీలేరు పర్యటన ఫొటోలను షేర్ చేసిన టీడీపీ అధినేత  
Are you not ashamed Jagan asks Chandrababu
చిత్తూరు జిల్లాలో ముస్లింలపై వైసీపీ నేతలు అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ట్విట్టర్ ద్వారా ఆయన స్పందిస్తూ... ఇంటర్ చదువుతున్న పటాన్ రియాజ్ ఖాన్, ఎంసీఏ చదువుతున్న షేక్ సభా కరీం, ఐటీ ఉద్యోగం చేస్తున్న షేర్ ఫిరోజ్ లపై హత్యాయత్నం కేసులు పెట్టి జైల్లో పెడతారా? అని ప్రశ్నించారు. ఇదేమి రాజకీయం అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ప్రశ్నించారు. సిగ్గనిపించడం లేదా జగన్ రెడ్డీ అని నిలదీశారు. 

నిన్న తన పీలేరు పర్యటన ఫొటోలను చంద్రబాబు షేర్ చేశారు. ఇటీవల ఆయన కుప్పం పర్యటనకు వెళ్లినప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో పీలేరు జైల్లో ఉన్న వారిని చంద్రబాబు పరామర్శించారు.