Sensex: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 563 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 158 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడున్నర శాతం లాభపడ్డ ఎల్ అండ్ టీ షేర్ విలువ
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాల్లో ముగిశాయి. రియాల్టీ, పవర్, ఐటీ సూచీల అండతో మార్కెట్లు లాభాల్లో పయనించాయి. ఏసియా-పసిఫిక్ మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం మన మార్కెట్లపై ప్రభావం చూపింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 563 పాయింట్లు లాభపడి 60,655కి పెరిగింది. నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 18,053కి ఎగబాకింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఎల్ అండ్ టీ (3.51%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.67%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (1.77%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.56%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (1.47%). 

టాప్ లూజర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.67%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.81%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.74%), విప్రో (-0.63%), టాటా స్టీల్ (-0.50%).

More Telugu News