Dhanush: 'సార్' నుంచి బంజారా సాంగ్ రిలీజ్!

  • ధనుశ్ హీరోగా రూపొందిన 'సార్'
  • తమిళంలో 'వాతి' టైటిల్ ఖరారు
  • లెక్చరర్ పాత్రలో కనిపించనున్న ధనుశ్  
  • సంగీతాన్ని సమకూర్చిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • ఫిబ్రవరి 17వ తేదీన సినిమా విడుదల
Sir lyriccal song released

ధనుశ్ హీరోగా తెలుగులో 'సార్' సినిమా రూపొందింది. తమిళంలో ఈ సినిమాకి 'వాతి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార నాగవంశీ .. సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది.

ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి 'బంజారా' అనే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'ఇల్లేనాదని .. వాకిలి నాదేనంటే ఫక్కున నవ్వుతాది భూ తల్లి' అంటూ ఈ పాట మొదలవుతోంది.   

జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటకి సుద్దాల అశోక్ తేజ సాహిత్యాన్ని అందించగా, అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. తెలుగు .. తమిళ భషాల్లో ఒకే రోజున విడుదలవుతున్న ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News