విజయ్ 67వ సినిమా డిజిటల్ హక్కులు 160 కోట్లు?

  • విజయ్ 66వ సినిమాగా వచ్చిన 'వారసుడు'
  • లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సెట్స్ పై ఉన్న 67వ సినిమా
  • డిజిటల్ హక్కులను దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ 
  • విజయ్ సరసన అలరించనున్న త్రిష  
Vijay 67 movie update

విజయ్ 66వ సినిమాగా రూపొందిన 'వరిసు' తమిళనాట ఈ నెల 11వ తేదీన విడుదలైంది. తమిళంలో తొలి రోజునే విడుదలైన ఈ సినిమా అక్కడ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో 'వారసుడు' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. 

ఇక ఇప్పుడు విజయ్ తన 67వ సినిమాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టనున్నాడు. ఆల్రెడీ విజయ్ కి 'మాస్టర్' సినిమాతో హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చెన్నైలోని ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. విజయ్ జోడీగా త్రిష అలరించనుంది. 

ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. షూటింగు జరుగుతూ ఉండగానే ఈ సినిమా డిజిటల్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు సొంతం చేసుకున్నారని టాక్. అన్ని భాషల్లోను కలుపుకుని ఈ హక్కుల నిమిత్తం వాళ్లు 160 కోట్లను చెల్లించినట్టుగా సమాచారం. విజయ్ కి ఉన్న క్రేజ్ .. లోకేశ్ కి ఉన్న ఇమేజ్ ఈ స్థాయి డిమాండ్ కి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News