మహేశ్ బాబు, తివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు

  • గతంలో షూటింగ్ మొదలై నిలిచిపోయిన ఎస్ఎస్ఎంబీ28
  • స్క్రిప్ట్ విషయంలో మహేశ్ బాబు అభ్యంతరాలు
  • కుటుంబ వినోద చిత్రంగా మార్చిన తివిక్రమ్ శ్రీనివాస్
Mahesh Babu SSMB 28 shoot resumes action sequences to be shot for 2 weeks

మహేశ్ బాబు, తివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రానున్న ఎస్ఎస్ఎంబీ 28 సినిమా షూటింగ్ రేపటి నుంచి (జనవరి 18) మొదలు కానుంది. మొదటి రెండు వారాలు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. హైదరాబాద్ లోని ఓ సినిమా స్టూడియోలో వీటిని చిత్రీకరిస్తారు. 

నిజానికి ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ కొన్ని నెలల క్రితమే మొదలైంది. స్క్రిప్ట్ విషయంలో సంతృప్తి లేకపోవడంతో మహేశ్ బాబు అందులో మార్పులు చేయాలని కోరడంతో షూటింగ్ నిలిచిపోయినట్టు వార్తలొచ్చాయి. అప్పుడు కూడా యాక్షన్ సన్నివేశాలతోనే షూటింగ్ ఆరంభించారు. యాక్షన్ సన్నివేశాలకు అంబరీవ్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. 

మహేశ్ సూచనతో స్క్రిప్ట్ పై తిరిగి పనిచేసిన తివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి యాక్షన్ సినిమాగా కాకుండా, దీన్ని కుటుంబ వినోద చిత్రంగా మార్చినట్టు తెలుస్తోంది. మార్చిన స్క్రిప్ట్ ఆధారంగా షూటింగ్ మళ్లీ మొదలు కాబోతోంది. ఈ సారి యాక్షన్ సన్నివేశాలకు అంబరీవ్ కాకుండా రామ్-లక్ష్మణ్ కొరియోగ్రాఫర్లుగా పనిచేస్తున్నారు. ఇది కూడా మహేశ్ బాబు కోరిక మేరకే జరిగిన మార్పుగా తెలుస్తోంది.

More Telugu News