రోడ్డుపై సిగరెట్ పీక పడేసినందుకు రూ.55 వేల జరిమానా విధించిన ఇంగ్లాండ్ కోర్టు!
- ఇంగ్లాండ్ లోని థోర్న్ బరీ టౌన్ లో ఘటన
- తొలుత రూ.15 వేలు ఫైన్ వేసిన అధికారులు
- జరిమానా కట్టకపోవడంతో కోర్టుకు చేరిన కేసు
- ఫైన్ మొత్తాన్ని రూ.55 వేలకు పెంచిన న్యాయమూర్తి
టౌన్ లో అలెక్స్ డేవిస్ అనే వ్యక్తి సిగరెట్ తాగి, పీకను రోడ్డుపై పడేశాడు. స్ట్రీట్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఇది చూసి అలెక్స్ కు రూ.15 వేలు (150 పౌండ్లు) జరిమానా విధించారు. ఆ మొత్తం వెంటనే కట్టాలని ఆదేశించారు. అయితే, అలెక్స్ ఈ ఆదేశాలను లెక్కచేయకుండా వెళ్లిపోయాడు. దీంతో అలెక్స్ ను అధికారులు కోర్టుకీడ్చారు. రోడ్లపై చెత్త పడేశాడని, జరిమానా చెల్లించేందుకు ఇష్టపడలేదని ఆరోపించారు. కేసు విచారించిన న్యాయమూర్తి.. అలెక్స్ కు రూ.55 వేలు జరిమానా విధించారు.