Taliban: మహిళలపై ఆంక్షలను రద్దు చేయం: తాలిబాన్లు

  • తాలిబాన్ల పాలనలో స్వేచ్ఛను కోల్పోయిన మహిళలు
  • షరియా చట్టం నీడన దుర్భర జీవితం
  • షరియా చట్టానికి లోబడే అన్ని అంశాలను నియంత్రిస్తామన్న తాలిబాన్ ప్రతినిధి
Talibans clarifies that they will not lift sanctions on women

ఆఫ్ఘనిస్థాన్ లో మహిళలకు ఏ మాత్రం స్వేచ్ఛ లేదనే విషయం తెలిసిందే. తాలిబాన్ల పాలనలో తమ హక్కులను కోల్పోతూ వారు అత్యంత కఠినమైన షరియా చట్టం నీడలో బతుకుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తున్నప్పటికీ తాలిబాన్లు వారి పద్ధతిని మార్చుకోవడం లేదు. మహిళలకు విద్య, ఉద్యోగావకాశాలను కల్పిస్తామని తాలిబాన్లు చెప్పినప్పటికీ ఆ దిశగా వారు ఒక్క అడుగు కూడా వేయలేదు. అంతేకాదు రోజురోజుకూ మహిళల హక్కులను హరిస్తూ వస్తున్నారు. అక్కడి మహిళలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. 

తాజాగా తాలిబాన్ అధికార ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ మాట్లాడుతూ... మహిళలపై ఆంక్షలను రద్దు చేయడం కుదరదని చెప్పారు. ఇస్లామిక్ చట్టాన్ని ఉల్లంఘించే చర్యలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. షరియా చట్టాన్ని వ్యతిరేకించేవారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. షరియా చట్టానికి లోబడే అన్ని అంశాలను నియంత్రిస్తామని తెలిపారు. మహిళల హక్కులకు ప్రాధాన్యతను ఇచ్చేది లేదని స్పష్టం చేశారు.

More Telugu News