Nepal: నేపాల్ విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం

  • మృతుల్లో ఐదుగురు భారతీయులు 
  • 72 మందితో కూడిన విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదం
  • రన్ వే పై విమానం కుప్పకూలడంతో భారీగా ప్రాణ నష్టం
Nepal plane carrying 72 people crashes in Pokhara

నేపాల్ లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది మృతి చెందారు. ఇందులో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. 72 మందితో కూడిన విమానం నేపాల్ లోని కస్కి జిల్లాలో పోఖరా విమానాశ్రయంలో ల్యాండింగ్ కోసం ప్రయత్నిస్తుండగా కుప్పకూలి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో 68 మంది ప్రయాణికులు కాగా, నలుగురు సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు నేపాల్ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది.

మృతుల్లో ఐదుగురు భారతీయులు, నలుగురు రష్యన్లు, ఇద్దరు దక్షిణ కొరియా, ఒకరు ఐర్లాండ్ కు చెందిన వారిగా గుర్తించారు. మిగతా వాళ్లు నేపాల్ కు చెందిన వాళ్లు అని తెలుస్తోంది. 

యతి ఎయిర్ లైన్స్ కి చెందిన విమానం రన్ వే పై కూలిపోవడంతో ఎయిర్ పోర్టును అధికారులు మూసివేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన వాళ్లను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వెలికి తీస్తున్నారు. కాగా, ఈ ఘటనపై నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ అత్యవసర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. సహాయ చర్యలు ముమ్మరం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

More Telugu News