Pakistan: పాకిస్థాన్ లో హిందూ బాలుడికి జైలు శిక్ష

Hindu boy arrested in Pakistan
  • పాక్ లో హిందూ అమ్మాయిలను మతమార్పిడి చేస్తున్న వైనం
  • దేవుడిని ప్రశ్నిస్తూ హిందూ యువకుడి పోస్ట్
  • తల్లిదండ్రులకు కూడా సమాచారమివ్వకుండానే అరెస్ట్ చేసిన ప్రభుత్వం

పాకిస్థాన్ లో హిందూ అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం, వారిని బలవంతంగా మతమార్పిడి చేయడం వంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఈ మత మార్పిడులపై లవ్ కుమార్ అనే హిందూ యువకుడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఓ దేవుడా, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఇంత క్రూరంగా ఎలా వ్యవహరిస్తున్నావని ఉర్దూలో రాశాడు. 

ఈ పోస్ట్ పై పాక్ ప్రభుత్వం కన్నెర్రజేసింది. అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండానే అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపింది. తమ కుమారుడు కనిపించకపోవడంతో నవంబర్ 22 నుంచి అతని తల్లిదండ్రులు వెతుకుతున్నారు. అయితే, అతడిని జైల్లో పెట్టినట్టు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. పాకిస్థాన్ లో దైవ దూషణ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు.

  • Loading...

More Telugu News