Women IPL: మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల పేర్లు ఈ నెల 25న ప్రకటన

  • ఇప్పటిదాకా పరిమిత స్థాయిలో మహిళలతో ఐపీఎల్ మ్యాచ్
  • ఇకమీదట పూర్తిస్థాయిలో మహిళల ఐపీఎల్
  • ఐదు ఫ్రాంచైజీలతో ప్రారంభ ఎడిషన్
  • మార్చిలో మహిళల ఐపీఎల్!
Women IPL franchise names will reveal on January 25

గత కొన్ని ఐపీఎల్ సీజన్లలో మహిళా క్రికెట్ టీమ్ లతో ఒకటీ అరా మ్యాచ్ లు నిర్వహించిన బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో మహిళా ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. మహిళల ఐపీఎల్ తొలి సీజన్ లో 5 ఫ్రాంచైజీలు ప్రాతినిధ్యం వహించనున్నాయి. ఈ ఫ్రాంచైజీ పేర్లను బోర్డు ఈ నెల 25న అధికారికంగా ప్రకటించనుంది. 

కాగా, మహిళల ఐపీఎల్ లో ఐదు జట్లు ఒక్కో టీమ్ తో రెండుసార్లు ఆడతాయి. మొత్తం 20 మ్యాచ్ లు జరగనున్నాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు ఫైనల్ లో పోటీపడతాయి. 2, 3 స్థానాల కోసం ఎలిమినేటర్ మ్యాచ్ నిర్వహిస్తారు. 

ప్రస్తుతం పురుషుల ఐపీఎల్ లో 10 ఫ్రాంచైజీలు ఉండగా, వీటిలో 8 ఫ్రాంచైజీలు మహిళా టీమ్ లను ఏర్పాటు చేసేందుకు ఆసక్తిచూపుతున్నాయి. 

చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు ఇప్పటికే మహిళా జట్ల కోసం బిడ్లు దాఖలు చేశాయి. మిగిలిన రెండు ఫ్రాంచైజీలు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ బిడ్లు దాఖలు చేసే విషయంలో స్పష్టతలేదు. మహిళల ఐపీఎల్ మార్చిలో నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News