Dharmana Prasada Rao: శ్రీశ్రీ ఆశయాల కోసం పని చేసేవారు పవన్ కల్యాణ్ లా మాట్లాడరు!: ధర్మాన ప్రసాదరావు

As an actor I respect Pawan Kalyan says Dharmana Prasada Rao
  • పవన్ సీరియస్ పొలిటీషియన్ కాదన్న ధర్మాన
  • ప్రజల పన్నులతో అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోమని వ్యాఖ్య
  • చంద్రబాబు మళ్లీ వస్తే పెట్టుబడులన్నీ అమరావతిలోనే పెడతారన్న ధర్మాన
జనసేనాని పవన్ కల్యాణ్ ఒక సీజనల్ పొలిటీషియన్ అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. రాజకీయాల పట్ల ఆయనకు సీరియస్ నెస్ లేదని చెప్పారు. ఒక నటుడిగా పవన్ పై తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపారు. శ్రీశ్రీ ఆశయాల కోసం పని చేసేవారు పవన్ కల్యాణ్ మాదిరి మాట్లాడరని అన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన పథకాలు శ్రీశ్రీ ఆశించిన వర్గాల ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.

గతంలో శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యలు ఇప్పుడు లేవని అన్నారు. ఉద్ధానం బాధితుల కోసం జగన్ తీసుకున్న చర్యలను పవన్ అభినందించలేకపోతున్నారని చెప్పారు. ప్రజలు కడుతున్న పన్నులతో అమరావతిని అభివృద్ధి చేస్తామంటే ఒప్పుకోబోమని అన్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే పెట్టుబడులన్నీ అమరావతిలోనే పెడతారని విమర్శించారు. సైనికుల భూములను కబ్జా చేశానని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
Dharmana Prasada Rao
Jagan
ysrcp
Pawan Kalyan
Janasena
Chandrababu
Telugudesam

More Telugu News