Police: తెలంగాణ పోలీసు నియామక పరీక్ష తేదీల్లో మార్పు

Telangana state police recruitment tests dates changed
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల తెలంగాణలో పోలీసు విభాగం ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మార్చి 12, ఏప్రిల్ 23 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, ఈ పరీక్షల తేదీలను మార్చుతూ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు  ప్రకటన చేసింది. 

సబ్ ఇన్ స్పెక్టర్ (ఐటీ), అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్ (ఫింగర్ ప్రింట్స్) పరీక్షలు మార్చి 12 నుంచి మార్చి 11వ తేదీకి మార్చారు. అంటే, ఒకరోజు ముందుకు జరిపారు. 

ఇక, కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షలను ఏప్రిల్ 23 నుంచి 30వ తేదీకి మార్చారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఈ మేరకు మార్పులు చేసింది.
Go Back to Shorts
Police
Recruitment Tests
Dates
Telangana

More Telugu News