Rahul Dravid: ద్రావిడ్ కు అనారోగ్యం.. బెంగళూరులోని నివాసానికి చేరుకున్న హెడ్ కోచ్

Dravid is unwell Head coach arrives at his residence in Bengaluru
  • అనారోగ్యంతోనే నిన్న రెండో వన్డేకు సేవలందించిన ద్రావిడ్
  • ఈ తెల్లవారుజామున కోల్ కతా నుంచి బెంగళూరుకు పయనం
  • తిరువనంతపురం మ్యాచ్ కు దూరం
టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అనారోగ్యానికి గురయ్యారు. నిన్న కోల్ కతాలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సమయంలో కూడా ద్రావిడ్ అనారోగ్యంగానే ఉన్నారు. అయినప్పటికీ జట్టుతోనే ఆయన గడిపారు. ఆటగాళ్లకు కీలక సలహాలను ఇస్తూ జట్టు విజయంలో తనదైన పాత్రను పోషించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆయన బెంగళూరులోని తన నివాసానికి చేరుకున్నారు. 

ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కోల్ కతా నుంచి బెంగళూరుకు విమానంలో బయల్దేరారు. అనారోగ్యం నేపథ్యంలో తిరువనంతపురంలో జరిగే చివరి వన్డేకు ద్రావిడ్ అందుబాటులో ఉండరు. మరోవైపు శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ ను భారత్ ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. నామమాత్రమైన మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలనే పట్టుదలతో భారత్ ఉంది.
Rahul Dravid
Cricket

More Telugu News