Virat Kohli: ఈడెన్ గార్డెన్స్ లో ఇషాన్ కిషన్ తో కలిసి డ్యాన్స్ చేసిన కోహ్లీ.. వీడియో ఇదిగో!

Virat Kohli  Ishan Kishan dancing during the light show at Eden
  • గురువారం రాత్రి శ్రీలంక, భారత్ మధ్య రెండో వన్డే
  • మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో లేజర్ షో ఏర్పాటు
  • పోటాపోటీగా స్టెప్పులు వేసిన కోహ్లీ, ఇషాన్
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంతో సరదాగా ఉంటాడు. మ్యాచ్ ఆడుతున్నప్పుడు ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనే విరాట్ తర్వాత ఉల్లాసంగా కనిపిస్తుంటాడు. తన స్టార్ ఇమేజ్ ను పక్కనబెట్టి తోటి ఆటగాళ్లతో కలిసిపోతాడు. తనకంటే చిన్నవాళ్లతోనూ సరదాగా ఉంటాడు. అప్పుడప్పుడు తోటి ఆటగాళ్లతో కలిసి సరదగా డ్యాన్స్ చేస్తుంటాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం రాత్రి శ్రీలంకతో రెండో వన్డే ముగిసిన తర్వాత విరాట్ తనలోని డ్యాన్సర్ ను నిద్రలేపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత లేజర్ లైటింగ్ షోను ఏర్పాటు చేయగా.. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ తో కలిసి కోహ్లీ హుషారుగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకర్షించాడు. 

డగౌట్ దగ్గర ఇద్దరూ పోటాపోటీగా స్టేప్పులు వేయగా స్టాండ్స్ లోని ప్రేక్షకులు గట్టిగా అరుస్తూ వాళ్లను ఉత్సాహపరిచారు. ఇద్దరి నృత్యాన్ని తమ సెల్ ఫోన్లలో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు నెట్ లో వైరల్ గా మారాయి. కాగా, రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో శ్రీలంకను భారత్ ఓడించింది. దాంతో, మూడు వన్డేల సిరీస్ ను 2–0తో గెలిచింది. ఇరు జట్ల మధ్య చివరి, మూడో వన్డే ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.
Virat Kohli
Ishan Kishan
dance

More Telugu News