OLA: మరోసారి ఉద్యోగుల‌ను తొల‌గించిన ఓలా

  • గత ఏడాది 1,100 మంది ఉద్యోగులను తొలగించిన ఓలా
  • తాజాగా మరో 200 మంది ఉద్యోగులపై వేటు
  • పునర్వ్యవస్థీకరణలో భాగంగానే తొలగింపులన్న ఓలా
OLA terminates 200 employees

పలు దిగ్గజ కంపెనీలు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. క్యాబ్ ఆపరేటింగ్ కంపెనీ ఓలా కూడా పెద్ద సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతోంది. గత ఏడాది ఓలా 1,100 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో ఓలా ఎలక్ట్రిక్, ఓలా క్యాబ్స్, ఓలా ఫైనాన్సియల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. 

తాజాగా మరో 200 మంది ఉద్యోగులను తొలగించింది. వీరిలో టెక్నాలజీ, ప్రాడక్ట్ విభాగాల్లోని ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగానే ఈ తొలగింపులు అని ఓలా తెలిపింది. తొలగించిన ఉద్యోగులకు కాంపెన్సేషన్ ప్యాకేజీలను అమలు చేస్తామని వెల్లడించింది. మరోవైపు ఇంజినీరింగ్, డిజైన్ విభాగాల్లో నియామకాలు ఉంటాయని తెలిపింది. సీనియర్ ఉద్యోగులను సైతం రిక్రూట్ చేసుకుంటామని చెప్పింది.

More Telugu News