Chandrababu: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు పావులూరి కృష్ణ చౌదరి గారి మరణం విచారకరం: చంద్రబాబు

Chandrababu condolences to the demise of Dr Pavuluri Krishna Chowdary
  • ప్రఖ్యాత హోమియో వైద్యుడు పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూత
  • హోమియో వైద్య వ్యాప్తికి విశేష కృషి చేశారన్న చంద్రబాబు
  • పావులూరి మరణం విచారకరం అంటూ ట్వీట్

సుప్రసిద్ధ హోమియో వైద్య నిపుణుడు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి కన్నుమూసిన సంగతి తెలిసిందే. 96 ఏళ్ల పావులూరి కృష్ణ చౌదరి వృద్ధాప్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. 

ఈ నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. ఐదు దశాబ్దాల కిత్రమే తెలుగునాట ప్రతి ఇంటికీ హోమియో వైద్యాన్ని తీసుకెళ్లేందుకు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన మరణం విచారకరం అని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. పావులూరి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News