Apple: రూ.8,000కే యాపిల్ ఎయిర్ పాడ్స్

Apple may soon launch affordable AirPods for roughly Rs 8000 2nd gen AirPod Max in the works too
  • తక్కువ ధరకు వేరియంట్ ను తీసుకురావడంపై దృష్టి
  • 2024 చివర్లో విడుదల చేసే అవకాశాలు
  • ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా
యాపిల్ సంస్థ హెడ్ సెట్స్ విభాగంలోనూ మార్కెట్ విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. తక్కువ ధరకు ఎయిర్ పాడ్స్ తీసుకురావడంపై పనిచేస్తున్నట్టు సమాచారం బయటకు వచ్చింది. యాపిల్ 2024 ద్వితీయ ఆరు నెలల్లో అందుబాటు ధరకు ఇయర్ బడ్స్ విడుదల చేయవచ్చని ప్రముఖ అనలిస్ట్ మింగ్ చీ కువో అంచనా వేస్తున్నారు. ఒకవేళ జాప్యం నెలకొంటే 2025లో విడుదల కావచ్చని చెబుతున్నారు. 

కొత్తగా తీసుకొచ్చే ఎయిర్ పాడ్స్ ధర రూ.8,000 ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఎయిర్ పాడ్స్ తక్కువకు కావాలంటే రెండో జనరేషన్ కోసం రూ.14,900 వెచ్చించాల్సి వస్తోంది. గతేడాది యాపిల్ విడుదల చేసిన మూడో జనరేషన్ ఎయిర్ పాడ్స్ ధర రూ.19,900. యాపిల్ ఎయిర్ పాడ్స్ సరఫరాదారులను మార్చొచ్చనే అంచనాలు సైతం వినిపిస్తున్నాయి. ఎయిర్ పాడ్స్ అంటే ఇష్టం ఉండి ధరను చూసి వెనక్కి తగ్గే వారికి.. చౌక ఎయిర్ పాడ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. యాపిల్ సంస్థ ఆడియో మార్కెట్లో వాటాను కూడా పెంచుకోవచ్చు.
Apple
AirPods
affordable
Rs 8000

More Telugu News