father: తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చాల్సిందే: కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

Fathers loan should be cleared by son says  AP High Court
  • 2003లో రూ. 2.60 లక్షల అప్పు చేసిన భారమప్ప 
  • ఆయన చనిపోవడంతో అప్పుతీర్చమని కొడుకుని కోరిన రుణదాత  
  • అప్పు చెల్లించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించిన బాధితుడు
తండ్రి ఆస్తులను కొడుకులు పంచుకుంటారే కానీ... వారు చేసిన అప్పులను పంచుకోవడానికి మాత్రం ఒప్పుకోరు. తన తండ్రి చేసిన అప్పులతో తనకేం సంబంధం? అని ప్రశ్నిస్తుంటారు. ఇలాంటి కొడుకులకు షాకిచ్చేలా కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నెగోషియబుల్ ఇన్ స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం మరణించిన తండ్రి అప్పులను, ఆయన బాధ్యతలను తీర్చాల్సిన బాధ్యత కొడుకుదేనని తెలిపింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... భారమప్ప అనే వ్యక్తి వ్యాపారం, కుటుంబ అవసరాల నిమిత్తం 2003లో ప్రసాద్ రాయకర్ అనే వ్యక్తి నుంచి రూ. 2.60 లక్షలు రూ. 2 వడ్డీతో తీసుకున్నారు. ఆ అప్పును తీర్చకుండానే భారమప్ప మరణించాడు. దీంతో తన అప్పును తీర్చాలని భారమప్ప కొడుకు దినేశ్ ను ప్రసాద్ కోరగా... 2005లో రూ. 10 వేలు చెల్లించాడు. ఆ తర్వాత పలు దఫాలుగా చెక్కులు ఇచ్చాడు. అయితే, ఆ చెక్కులు బౌన్స్ అయ్యాయి. దీంతో ప్రసాద్ కోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు... ఐసీడీఎస్ లిమిటెడ్ వర్సెస్ బీనా షబీర్ అండ్ అన్ఆర్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావించింది. తండ్రి చేసిన అప్పును కొడుకు తీర్చాల్సిందేనని తీర్పును వెలవరించింది.
father
son
loan

More Telugu News