Andhra Pradesh: అద్నాన్ సమీకి అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి విడదల రజిని

Minister Rajani schools Adnan Sami over RRR Telugu row
  • ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతుందన్న జగన్
  • భారత పతాకం కాకుండా తెలుగు పతాకం అనడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అద్నాన్
  • ట్విట్టర్ లో అతిగా ఆలోచించే బదులు మరో గోల్డెన్ గ్లోబ్ వచ్చేలా కృషి చేయాలని హితబోధ
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి అభినందన సందేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలీవుడ్ అగ్ర గాయకుడు అద్నాన్ సమీకి ఏపీ మంత్రి విడదల రజినీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. కీర్తి, వేర్పాటు వాదం ప్రస్తావనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ లో ఎక్కువగా ఆలోచించే బదులు భారత్ మరో గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలిచే దిశగా కృషి చేయాలని ఆయనకు సూచించారు. 

 ‘ఒకరి స్వంత గుర్తింపులో గర్వపడటం వారి దేశభక్తిని తగ్గించదు. ఒకరి మూలాన్ని గౌరవించడం వేర్పాటువాదాన్ని తెలియజేయదు. రెండింటికి ముడిపెట్టి తికమక పెట్టొద్దు. మీరు ట్విట్టర్‌లో అతిగా ఆలోచించడం కంటే భారతదేశానికి మరో గోల్డెన్‌ గ్లోబ్‌ని అందించడానికి కృషి చేయాలి’ అని ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ కు గోల్డెన్ గ్లోబ్ దక్కడంపై హర్షం వ్యక్తం చేసిన జగన్.. ప్రపంచ వేదికపై తెలుగు పతాకం రెపరెపలాడుతుందన్నారు. తెలుగు పతాకం కాకుండా భారత పతాకం అనాల్సిందంటూ అద్నాన్ సమీ ట్వీట్ చేశారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది.
Andhra Pradesh
YS Jagan
RRR
Minister
Vidadala Rajini
adnan sami

More Telugu News