శ్రీవారిని భక్తులకు దూరం చేయాలనుకుంటున్నారా..?: చంద్రబాబు
- తిరుమలలో గదుల అద్దెను భారీగా పెంచడాన్ని ప్రశ్నించిన చంద్రబాబు
- ఒకేసారి గదుల అద్దెను 1100 శాతం పెంచడమేంటని నిలదీత
- భక్తుల మనోభావాలను గుర్తించాలని హితవు
సుదూర ప్రాంతాల నుంచి తిరుమల వచ్చే శ్రీవారి భక్తులపై మరింత భారం మోపుతూ గదుల అద్దెను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భారీగా పెంచేసింది. గతంలో రూ.150 ఉన్న అద్దె ప్రస్తుతం రూ,1,700, రూ.200 ఉన్న గది అద్దెను రూ.2,200లకు పెంచింది. ఇప్పటికే లడ్డూ ప్రసాదాల ధరలు పెంచిన టీటీడీ.. తాజాగా గదుల అద్దెను భారీగా పెంచడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.