iQOO 11: ఆకర్షణీయమైన డిజైన్ తో ఐకూ11 విడుదల

  • రూ.59,999 నుంచి ధర ప్రారంభం
  • రెండు వేరియంట్లలో విడుదల
  • 12వ తేదీ నుంచి అమెజాన్ లో విక్రయాలు
  • బ్యాంకు కార్డుపై రూ.1,000 తగ్గింపు
iQOO 11 launched in India Top specs price features and everything you need to know

‘ధర కొంచెం ఎక్కువైనా ఫర్వాలేదు.. ఫీచర్లలో రాజీ వద్దు’ ఈ విధానాన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అనుసరిస్తున్నాయి. తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నప్పటికీ.. సంపూర్ణ భోజనం మాదిరి అన్ని రకాల ఫీచర్లతోనూ ఫోన్లను ఆవిష్కరిస్తున్నారు. వీటికోసం రూ.25వేలకు పైనే వెచ్చించేలా మార్కెటింగ్ వ్యూహాలను అనుసరిస్తున్నాయి. ఇలాంటి అన్ని రకాల ఫీచర్లతో వచ్చిందే ఐకూ 11 . 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. 16జీబీ వేరియంట్ ధర రూ.64,999. 

జనవరి 12 నుంచి విక్రయాలు అమెజాన్ లో ఆరంభమవుతాయి. ప్రైమ్ యూజర్లు అదే రోజు కొనుగోలు చేసుకోవచ్చు. నాన్ ప్రైమ్ యూజర్లకు 13 నుంచి కొనుగోలుకు అవకాశం ఉంటుంది. రెండు రంగుల్లో ఇది విడుదలైంది. 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 144 హెర్జ్ రీఫ్రెష్ రేటు, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెనరేషన్ 2 చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ శామ్ సంగ్ జీఎన్5 లెన్స్, అలాగే 13 మెగాపిక్సల్ టెలీఫొటో లెన్స్, 8 మెగా పిక్సల్ అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా ఏర్పాటు చేశారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 120 వాట్ ఫాస్ట్ చార్జర్ తో రీచార్జ్ చేసుకోవచ్చు. గేమింగ్ ప్రియులకు ఈ ఫోన్ మరింత మెరుగైన అనుభవాన్ని ఇచ్చేందుకు వీలుగా సొంతంగా అభివృద్ధి చేసిన వీ2 ఇమేజింగ్ చిప్ ను అమర్చారు. బ్యాంకు కార్డ్ పై రూ.1,000 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.

More Telugu News