Deny boarding: అలాంటి ప్రయాణికులను అనుమతించొద్దు.. ఎయిర్ ఇండియా సర్క్యులర్

  • భద్రతకు రిస్క్ ఉందని భావిస్తే విమాన ప్రయాణానికి నిరాకరించండి
  • డ్యూటీ, స్టేషన్ మేనేజర్లకు ఎయిర్ ఇండియా ఆదేశాలు
  • ఏదైనా ఘటన జరిగితే వెంటనే రిపోర్ట్ చేయాలని సూచన
Deny boarding to passenger if there is security risk Air India tells cabin crew amid peeing row

రెండు దురదృష్టకర సంఘటనలతో టాటా గ్రూపుకు చెందిన ఎయిర్ ఇండియా మేనేజ్ మెంట్ లో చురుకుదనం వచ్చింది. ఇదే తరహా మరో ఘటనకు చోటు ఇవ్వరాదన్న ఉద్దేశ్యంతో కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. దురుసు ప్రవర్తనతో కూడిన ప్రయాణికుల గురించి వెంటనే సమాచారం అందించాలంటూ క్యాబిన్ క్రూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ప్రయాణికుడు, ప్రయాణికులతో తోటి ప్రయాణికులకు రిస్క్ ఉంటుందని భావిస్తే వారి ప్రయాణానికి నిరాకరించాలని డ్యూటీ మేనేజర్, స్టేషన్ మేనేజర్ కు సూచించింది. 

ప్రయాణికుల మధ్య దురుసు ఘటన ఏదైనా చోటు చేసుకుంటే, తర్వాత వారు రాజీ పడినా, సంబంధిత ఘటనపై విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ పోర్ట్ అధికారులకు లిఖిత పూర్వకంగా రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో మద్యం సేవించిన ఇద్దరు ప్రయాణికులు తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన ఘటనలు వెలుగు చూడడం తెలిసిందే. వీటి తర్వాత ఎయిర్ ఇండియా తీవ్ర విమర్శలపాలైంది. వీటిపై తాము వెంటనే స్పందించి ఉండాల్సిందని టాటా గ్రూపు చైర్ పర్సన్ చంద్రశేఖరన్ కూడా వ్యాఖ్యానించడం గమనార్హం.

More Telugu News