అమరావతిపై ఏపీ ప్రభుత్వ పిటిషన్... విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు
- అమరావతే ఏపీకి రాజధాని అంటూ హైకోర్టు తీర్పు
- స్టే ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం
- 161 మంది ప్రతివాదులకు నోటీసుల జారీ
- ఈ నెల 31 లోపు అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశాలు
ఈ నేపథ్యంలో, అమరావతి అంశంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం మంగళవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో రాజధాని రైతులు, పలు రాజకీయ పక్షాలను ప్రతివాదులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. జనవరి 31వ తేదీ లోపు అఫిడవిట్ దాఖలు చేయాలంటూ మొత్తం 161 మంది ప్రతివాదులను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.